ఇండియాలోకి చొరబడ్డ ISIS ఉగ్రవాదులు

- January 05, 2020 , by Maagulf
ఇండియాలోకి చొరబడ్డ ISIS ఉగ్రవాదులు

భారత్-నేపాల్ సరిహద్దు గుండా ఉత్తరప్రదేశ్‌లోని మహారాజాగంజ్, ఖుషీనగర్, సిద్దార్థ్ నగర్ జిల్లాల్లో ఐసీస్ ఉగ్రవాదుల జాడలు కనిపించాయి. ఉత్తరప్రదేశ్‌లోకి ఇద్దరు అనుమానితులు ప్రవేశించినట్లు తెలిపారు. అబ్దుల్ సమద్, ఇలియాస్‌లుగా గుర్తించాంమని ఐజీ అషుతోష్ కుమార్ వెల్లడించారు. వారు నేపాల్ నుంచి ఉత్తరప్రదేశ్ లోకి వచ్చేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది.

ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందుకోగానే అలర్ట్ అయ్యాం. వారిద్దరి ఫొటోగ్రాఫ్ లను అధికారులందరికీ పంపాం. చివరిసారిగా పశ్చిమబెంగాల్లోని సిలిగురి ప్రాంతంలో కనిపించారు. మాకు ఇలాంటి అలర్ట్స్ రావడం సర్వసాధారణమే. కానీ, మీడియా వరకూ వెళ్లిందంటే అది ఇన్వెస్టిగేషన్ అయినట్లే.


ఈ మేర ఇండియా-నేపాల్ బోర్డర్ లో సెక్యూరిటీ టైట్ చేశాం. ఒక వెయ్యి 751కిలోమీటర్ల మేర భద్రతను పెంచాం. ఇందులో ఉత్తరప్రదేశ్‌కు 599.3కిలోమీటర్లు సరిహద్దు ప్రాంతం ఉంది. నేపాల్ లోని ఏడు జిల్లాలు (పిలిభిట్, లఖీంపూర్ ఖేరీ, బహ్రైచ్, స్రావస్తి, బలరామ్‌పూర్, సిద్దార్థ్‌నగర్, మహారాజ్‌గంజ్) ఈ బోర్డర్ మీదుగా ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com