హీరో రాజశేఖర్ రాజీనామాకు 'మా' ఆమోదం
- January 05, 2020
హైదరాబాద్:'మా' ఎగ్జిగ్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి సినీ నటుడు రాజశేఖర్ చేసిన రాజీనామాను మా ఆమోదించింది. మా అధ్యక్షుడు నరేష్‌పై అసంతృప్తితో తాను ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజశేఖర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యకలాపాల పట్ల క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేసింది మా. అందులో సభ్యులుగా కృష్ణంరాజు, చిరంజీవి, మురళీ మోహన్, మోహన్ బాబు, జయసుధ ఉండనున్నారు.
అయితే ఈ నెల 2వ తేది జరిగిన మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడే సమయంలో రాజశేఖర్ ఆయన ప్రసంగానికి పలుమార్లు అడ్డుపడ్డారు. ఒకానొక సమయంలో చిరు దగ్గర నుంచి మైక్‌ను లాక్కొనే ప్రయత్నం చేశారు. దీంతో చిరంజీవి కాస్త అసహనానికి గురయ్యారు. ఈ చర్యను పలువురు ఖండించారు. మరోవైపు అదే రోజే మాలో తన పదవికి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మా ప్రెసిడెంట్ నరేష్‌పై ఆయన ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







