వైకుంఠ ఏకాదశి సందర్బంగా భారీగా ఏర్పాట్లు--టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
- January 05, 2020
తిరుమల:వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయని తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనానికి ఈ ఏడాది రెండురోజులపాటు అనుమతి ఇస్తామని, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నాడు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. అందరికీ ఉచిత లడ్డు ప్రతిపాదనపై పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని, జనవరి 20 నుంచి స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికీ ఉచిత లడ్డు ఇవ్వనున్నట్టు తెలిపారు. టీటీడీ పాలకమండలి భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారా దర్శనం ఎన్ని రోజులు పెట్టాలనే అంశంపై టీటీడీ పాలక మండలి అత్యవసరంగా సమావేశమైంది. ఉత్తర ద్వారా దర్శనం ఎన్ని రోజులు పెట్టాలనే అంశంపై అత్యవసర సమావేశం పెట్టామని ఆయన తెలిపారు. ఉత్తర ద్వారాలు పది రోజులు తెరవడంపై కమిటీ నియమించామని, కమిటీ నివేదిక ఆధారంగా వచ్చే ఏడాది దీనిని అమలు చెయ్యాలా? లేదా? అన్నది నిర్ణయిస్తామని తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు తిరుమల కొండపైకి చేరుకున్నారని, భక్తులకు ఏమాత్రం ఇబ్బంది కలుకుండా ఏర్పాట్లు చేశామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం తెల్లవారుజామునుంచే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని తెలిపారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







