శర్వా, సామ్ ల మూవీ ఫస్ట్ లుక్

- January 07, 2020 , by Maagulf
శర్వా, సామ్ ల మూవీ ఫస్ట్ లుక్

ఈ మధ్య అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించిన కాంబినేషన్ , శర్వానంద్ , సమంతా ల కాంబినేషన్ అని చెప్పాలి . ఈ మధ్య ప్రతీ సంవత్సరం సంక్రాంతికి తన సినిమాను బరిలో నిలిపి హిట్ కొట్టే శర్వానంద్ ఈసారి సంక్రాంతికి మాత్రం విరామం తీసుకున్నాడు . కానీ పండక్కి ముందు తన లేటెస్ట్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అభిమానులను ఖుషీ చేసాడు .

శర్వానంద్ - సమంత జోడీగా 'జాను' రూపొందుతోంది. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి శర్వానంద్ ఫస్టులుక్ ను విడుదల చేశారు. ఎడారి ప్రాంతంలో శర్వానంద్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటే, అతనికి ఒంటెలు ఎదురుపడటమనేది ఈ పోస్టర్లో కనిపిస్తోంది. ఎడారిలో శర్వానంద్ ప్రయాణం ఏ వైపు? ఎవరి కోసం? అనేది ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం.

తమిళంలో 2018 చివర్లో వచ్చిన '96' సినిమాకి ఇది రీమేక్. తమిళ సినిమాను రూపొందించిన ప్రేమ్ కుమార్ తెలుగు సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ సినిమాకి సంగీతాన్ని అందించిన గోవింద్ వసంత ఈ సినిమాకి కూడా బాణీలు కట్టాడు. తమిళంలో త్రిష - విజయ్ సేతుపతి జంటగా నటించిన '96' వైవిధ్యభరితమైన చిత్రంగా మంచి పేరు సంపాదించుకుంది. రీమేక్ గా దిల్ రాజు నిర్మిస్తున్న 'జాను' ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com