ముగిసిన ఖాసీం సులేమానీ అంత్యక్రియలు

- January 07, 2020 , by Maagulf
ముగిసిన ఖాసీం సులేమానీ అంత్యక్రియలు

 

బాగ్దాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై అగ్రరాజ్యం అమెరికా జరిపిన వైమానిక దాడిలో హతమైన ఇరాన్‌ సైనిక కమాండర్‌ ఖాసీం సులేమాన్‌ అంత్యక్రియలు ముగిశాయి. వేలాది ప్రజలు తరలివచ్చి.. తమ కమాండర్‌కు అంతిమ వీడ్కోలు పలికారు. అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇట్స్ డెత్ టూ అమెరికా అంటూ గర్జించారు. మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికాను హెచ్చరించారు. శనివారం ఒక సైని కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన సులేమాన్‌ హెలికాప్టర్‌.. బాగ్దాద్‌ సమీపంలోని పర్వతప్రాంతంలో కూలిపోయింది. అయితే, ఆ హెలికాప్టర్‌ను తమ సైన్యమే పేల్చేసిందని, వేలాది మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నందునే సులేమాన్‌ని హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించడంతో రెండు దేశాల మధ్య అగ్గి రాజుకుంది.
సులేమాన్‌ హత్యను ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించిన ఇరాన్‌ రాయబారి ఇది తమ బద్ధ విరోధి పాల్పడిన యుద్ధచర్యని పేర్కొన్నారు. అయితే, అమెరికాపై ప్రతిదాడి తప్పదని ఇరాన్.. గట్టిగానే హెచ్చరించింది. అయితే, ఉద్రిక్తతలు పెరగడంతో ఇరాక్‌కు మరిన్ని సైనిక బలగాలను పంపుతున్నట్టు అమెరికా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2015లో ఇరు దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించడంతో పాటు ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు విధించడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. క్రమంగా అవి పెరుగతూనే ఉన్నాయి. మరోవైపు అమెరికా బలగాలు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని.. ఇరాక్ పార్లమెంటు తీర్మానించింది. అయితే, ఇరాక్‌లో సైనిక స్థావరాల ఏర్పాటుకోసం చాలా ఖర్చు చేశామని, పరిహారం చెల్లిస్తే తప్ప అక్కణ్నుంచి కదిలే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com