సంక్రాంతి రారాజు నాగార్జునే !
- January 17, 2016
ఈ సారి సంక్రాంతి బాక్సాఫీసు రేసులో నాలుగు సినిమాలు పోటా పోటీగా విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నటించిన 'నాన్నకు ప్రేమతో', బాలయ్య నటించిన 'డిక్టేటర్', నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయనా', శర్వానంద్ 'ఎక్స్ ప్రెస్ రాజా' విడుదలయ్యాయి. విడుదలైన ఈ నాలుగు సినిమాలకు పాజిటివ్ టాక్ రావడంతో అన్ని సినిమాలకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.అయితే ఈ సంక్రాంతి రేసులో రారాజుగా నిలిచేది బాలయ్య లేదా ఎన్టీఆర్ అని అంతా భావించారు. అయితే అందుకు భిన్నంగా ఈ ఇద్దరినీ బీట్ చేసి నాగార్జున నటించిన 'సోగ్గేడే చిన్నినాయనా' చిత్రం ముందు ఉంది. అటు ప్రేక్షకుల స్పందన పరంగా, విమర్శకుల రివ్యూల పరంగా టాప్ రేటింగ్ నాగార్జున సినిమాకే దక్కింది.దీంతో ఈ సంక్రాంతి రారాజు నాగార్జునే అంటున్నారంతా.'మనం' సినిమా తర్వాత నాగార్జున తన సొంత బేనర్లో ఆ స్థాయిలో హిట్ అందుకోవడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా ఎఫెక్టుతో ఆయన తర్వాతి సినిమా 'ఊపిరి'పై అంచనాలు భారీగా పెరిగాయి.వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న 'ఊపిరి' చిత్రంలో తమిళ స్టార్ కార్తి కూడా నటిస్తుండటంతో ఈ సినిమా కోసం ఇప్పటి నుండే బయ్యర్లు పోటీ పడుతున్నారు. ఊపిరి చిత్రాన్ని మరో నెల రోజుల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్. హాలీవుడ్ మూవీ 'ది ఇంటచబుల్స్' కి రీమేక్ గా ఊపిరి తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున ఎక్కువ భాగం వీల్ చెయిర్ లోకనిపిస్తాడు. ఈ సినిమాలో వీరితో పాటు ఓ ముఖ్య పాత్రలో అనుష్క - అడవి శేష్ జంటగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే విదేశాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







