పదవతరగతి అర్హతతో రైల్ కోచ్ ఫ్యాక్టరీలోఉద్యోగావకాశాలు..
- January 10, 2020
భారతీయ రైల్వే వరుసగా రైల్వేతో పాటు రైల్వే అనుబంధ సంస్థలు కూడా నియామకాలు చేపడుతున్నాయి. ఇండియన్ రైల్వేస్‌కు చెందిన రైల్ కోచ్ ఫ్యాక్టరీ 400 పోస్టుల్ని ప్రకటించింది. కపుర్తలాలో గల యూనిట్లో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించి ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్ వంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది.
దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 6 చివరి తేదీ. 10వ తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కులతో మెరిట్ లిస్ట్ రూపొందించి అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. మరిన్ని ఇతర వివరాలకు రెల్ కోచ్ ఫ్యాక్టరీ అధికారిక వెబ్సైట్ https://rcf.indianrailways.gov.in చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 400… ఫిట్టర్: 100, వెల్డర్ (G & E): 100, మెషినిస్ట్: 40, పెయింటర్: 20, కార్పెంటర్: 40, మెకానిక్ (మోటార్ వెహికల్): 10, ఎలక్ట్రీషియన్: 56, ఎలక్ట్రానిక్ మెకానిక్: 14, ఏసీ & రిఫ్రిజిరేషన్ మెకానిక్: 20.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 2020 జనవరి 8, దరఖాస్తుకు చివరి తేదీ: 2020 ఫిబ్రవరి 6, విద్యార్హత: 50% మార్కులతో 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు: 100.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







