మహేశ్ ఇంటి ముందు ధర్నా చేసిన ముగ్గురు అరెస్ట్
- January 10, 2020
హైదరాబాద్: నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలించొద్దని రైతులు చేస్తున్న ఆందోళనకు సినీ నటీనటులు మద్దతివ్వాలని జై ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థి, యువజన పోరాట సమితి నాయకులు దీక్షకు దిగారు. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఇంటి ముందు ఇవాళ ముగ్గురు వ్యక్తులు నిరాహార దీక్ష చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆ ముగ్గుర్నీ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ముగ్గురు ఆందోళనాకారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
మహేశ్ ఇంటి ముందు రాజధాని కోసం నిరాహార దీక్ష : ఇదిలా ఉంటే ఏపీకి చెందిన సినిమా హీరోలు, నటులు స్పందించాలని ఏపీ విద్యార్థి యువజన పోరాట సమితి నేతలు వారు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి 19 వరకూ హీరోల ఇంటి ఎదుట ఆందోళన చేస్తామంటూ వారు ప్రకటించారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







