ఢిల్లీ:JNU లో దాడి ఘటన కీలక మలుపు
- January 11, 2020
ఢిల్లీ:జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లో దాడి ఘటన కీలక మలుపు తిరిగింది. ఈ దాడికి పాల్పడిన తొమ్మిది మంది అనుమానితుల ఫొటోలను దిల్లీ పోలీసులు విడుదల చేశారు. ఈ దాడిలో జేఎన్‌యూ విద్యార్థి నేత అయిషీ ఘోష్ పాత్ర కూడా ఉందని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమెకు సంబంధించిన ఫొటోను విడుదల చేశారు. ఇప్పటి వరకు .. దాడికి మీరంటే మీరు బాధ్యులు అని అటు వామపక్ష విద్యార్థి సంఘాలు, ఇటు ఏబీవీపీ ఆరోపించుకుంటున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు వెల్లడించిన వివరాలు సంచలనం సృష్టిస్తున్నాయి.
వీరంతా ఈనెల 5న వర్సిటీలోని పెరియర్ హాస్టల్‌పై దాడికి పాల్పడినట్లు సంచలన విషయాలు వెల్లడించారు ఢిల్లీ పోలీసులు. వామపక్ష విద్యార్థి సంఘాలకు చెందిన సభ్యులు జేఎన్ యూలోని సర్వర్ రూమ్ ను ధ్వంసం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు లేకపోవడం వల్ల నిందితులను గుర్తించడం కష్టమైందన్నారు. దాడి ఘటనకు సంబంధించి మూడు ఎఫ్ఐఆర్ లను నమోదు చేశామన్న పోలీసులు.. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని చెబుతున్నారు. దాడికి పాల్పడింది వారేనని విచారణలో రుజువైతే.. చట్ట ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేస్తామని అన్నారు.
మరోవైపు.. జేఎన్ యూ దాడికి సంబంధించి పోలీసులు చేసిన ఆరోపణలను అయిషీ ఘోష్ ఖండించారు. తాను ఎలాంటి దాడికీ పాల్పడలేదని ఆమె అన్నారు. పోలీసులు కావాలనే విషయాన్ని తప్పుదోవ పట్టిస్తూ తనని ఇరికిస్తున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించిన రుజువులు తమ వద్ద ఉన్నాయన్నారు. చట్టం మీద పూర్తి నమ్మకం ఉందన్న అయిషీ… తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు. ఐతే.. ఎటువంటి దాడికి పాల్పడకున్నా.. పోలీసులు ఇలా తననై ఎందుకు నేరం మోపుతున్నారని ప్రశ్నించారు.
అటు.. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణేపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు. సీఆర్పీఎఫ్ జవాన్ చనిపోయిన ప్రతిసారీ పండగచేసుకుంటోన్న వాళ్లకు…మీరు మద్దతు తెలుపుతున్నారనే విషయం మీకు తెలుసు. కొంత మంది అమ్మాయిలను వారి ప్రైవేట్ పార్ట్స్‌పై దాడిచేసిన వ్యక్తుల వెనుక తాను నిలబడుతున్నట్టు దీపికాకి కూడా తెలుసు. వాళ్లకు మద్దతుగా ఆమె నిలబడటం అనేది ఆమెకున్న హక్కు. అమ్మాయిలను కొట్టిన వ్యక్తుల వైపు నిలబడిన ఆమె హక్కును నేను ప్రశ్నించలేను అంటూ దీపికానుద్దేశించి ఎద్దేవా చేశారు స్మృతి ఇరానీ.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







