ఒమన్: సుల్తాన్ కబూస్ బిన్ సైద్ అల్ సైద్ వారసుడు ఎవరు?
- January 11, 2020
ఒమన్: అనారోగ్యంతో కన్నుమూసిన సుల్తాన్ కబూస్ బిన్ సైద్ వారసుడు ఎవరు? సుల్తాన్ కబూస్ స్థానంలో ఒమన్ సుల్తాన్ గా ఎవరు బాధ్యతలు చేపట్టబోతున్నారు.
కొన్నాళ్లు ఒమన్ లో సస్పెన్స్ గా మారిన ఈ ప్రశ్నకు సమాధానం సీల్డ్ కవర్ లో భద్రంగా ఉంది. ఆరోగ్యం విషమించటంతో తన తదుపరి వారసుడి పేరును సుల్తాన్ కబూస్ బిన్ సైద్ ముందుగానే సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. వారసుడి పేరును సీల్డ్ కవర్ లో రాసి దాచిపెట్టారు. తాను కాలం చేసిన తరువాతే కవర్ ఓపెన్ చేయాలని కండీషన్ కూడా పెట్టారు. దీంతో సీల్డ్ కవర్ లో ఎవరి పేరు ఉందనేది ఉత్కంఠ రేపుతోంది.
సుల్తానేట్ రాజరిక ఆచారాల ప్రకారం సింహాసనం ఖాళీ అయిన మూడు రోజుల్లోనే కొత్త సుల్తాన్ ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. 50 మంది పురుష సభ్యులు ఉంటే సుల్తానేట్ రాయల్ కౌన్సిల్ కొత్త సుల్తాన్ ను ఎంపిక చేస్తుంది. అయితే..దివంగత సుల్తాన్ కబూస్ బిన్ సైద్ ఇప్పటికే తన వారసుడ్ని డిక్లేర్ చేసి సీల్డ్ కవర్ లో దాచిపెట్టారు. దీంతో రాయల్ కౌన్సిల్ ద్వారా ఎంపిక పద్దతిన కాకుండా సీల్డ్ కవర్ లో ఉన్న పేరు ఉన్న వారికే సుల్తాన్ పదవి దక్కనుంది. దేశ అత్యున్నత పదువుల్లో ఉన్న పలు విభాగాల ప్రముఖుల సమక్షంలో ఈ సీల్డ్ కవర్ ను ఓపెన్ చేస్తారు. డిఫెన్స్ కౌన్సిల్ మెంబర్స్, సుప్రీం కోర్టు ఛైర్మన్, కన్సల్టేటీవ్ కౌన్సిల్, స్టేట్ కౌన్సిల్ సమక్షంలో కవర్ తెరుస్తారు.
దీంతో తర్వాతి సుల్తాన్ పోటీలో అతని బంధువలుల్లోని ముగ్గురు సోదరుల పేర్లు పోటీలో ఉన్నట్లు..వారి పేర్లలోనే ఒకరిని తన వారసుడిగా సుల్తాన్ కబూస్ బిన్ సైద్ ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సాంస్కృతిక శాఖ మంత్రి హైతం బిన్ తారిక్ అల్ సైద్, ఉప ప్రధాని అసద్ బిన్ తారిక్ అల్ సైద్, ఒమన్ నేవీ మాజీ కమాండర్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సైద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే..ఒమన్ సర్వ నిర్ణయాధికారి సుల్తాన్ ఎవరనేది సీల్డ్ కవర్ లో ఓపెన్ చేసిన తర్వాత క్లారిటీ రానుంది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..