పుదీనా - రాజ్మా బిర్యాని ...
- January 17, 2016
కావలసిన పదార్థాలు : బియ్యం - కేజీ, పుదీనా - నాలుగు కట్టలు, రాజ్మా గింజలు - 200 గ్రా, అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు టేబుల్ స్పూన్లుఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిరపకాయలు - ఆరు, నూనె - 100గ్రా, నెయ్యి - 100గ్రా, లవంగాలు - 6దాల్చినచెక్క - చిన్న ముక్కలు నాలుగు, ఉప్పు - తగినంత
తయారీ విధానం :
ముందురోజు రాత్రి రాజ్మా గింజల్ని నానబెట్టాలి. బిర్యానీ తయారు చేయడానికి ముందు బియ్యాన్ని కడిగి పెట్టుకోవాలి. కాడలు లేకుండా పుదీనా ఆకులను తుంచి శుభ్రంగా కడిగి గ్రైండ్ చేసుకోవాలి. వెడల్పుగా ఉన్న గిన్నెలో నూనె, నెయ్యి వేసి కాగిన తర్వాత లవంగాలు, దాల్చినచెక్క వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, రాజ్మాగింజలు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఇప్పుడు పుదీనా పేస్టు వేసి దోరగా వేయించి తగినంత నీరు పోసి ఉప్పు వేయాలి. నీళ్లు మరిగిన తరువాత బియ్యం వేసి ఉడకనివ్వాలి. అంతే పుదీనా - రాజ్మా బిర్యానీ రెడీ అయినట్లే.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







