జీరో డిగ్రీల కంటే తగ్గిన ఉష్ణోగ్రత
- January 16, 2020మస్కట్: సుల్తానేట్‌లో బుధవారం భారీ వర్షాలు కురవడంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. కొన్ని చోట్ల జీరో కంటే కూడా తక్కువకు ఉష్ణోగ్రతలు పడిపోవడం గమనార్హం. ఒమన్ మిటియరాలజీ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం ఃజబెల్ అక్దర్ ప్రాంతంలోని సైక్లో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోషల్ మీడియాలో మేరకు స్నో ఫాల్ ఫొటోలు దర్శనమిచ్చాయి. హై ఆల్టిట్యూడ్ మౌంటెయిన్ రేంజెస్‌లో స్నో ఫాల్ ఎక్కువగా కన్పించింది. ఈ వాతావరణాన్ని ఆస్వాదించేందుకు జబాల్ షామ్స్, జబాల్ అక్దర్ ప్రాంతాలకు వెళుతున్నారు. కాగా, దోఫార్ గవర్నరేట్‌లోని మిర్బాత్లో అత్యధికంగా 26.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలా వుంటే, మస్కట్‌లో జనవరి 14, 15 తేదీల్లో 56 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది.
తాజా వార్తలు
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్‌లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం