తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!

- May 12, 2024 , by Maagulf
తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!

న్యూ ఢిల్లీ: టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్‌లైన్ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. అనారోగ్యం పేరిట సిక్ లీవ్ తీసుకుని నిరసనకు దిగిన ఎయిర్‌లైన్ సిబ్బంది తిరిగి విధుల్లో చేరారని క్యాబిన్ క్రూ యూనియన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. రద్దు అయిన విమాన సర్వీసులను క్రమంగా పునరుద్దరిస్తోంది.

ప్రతిరోజూ దాదాపు 380 సర్వీసులను నడుపుతున్న ఎయిర్‌లైన్ ఆదివారం కనీసం 20 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేసింది.అయితే, మంగళవారం ఉదయం (మే 14) నాటికి పూర్తి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని సంబంధిత అధికారి తెలిపారు. దీనిపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఎయిర్‌లైన్‌లో నిర్వహణ పరమైన సంస్థలు, తమ సిబ్బందిలో కొంతమంది పై వివక్ష చూపిందని ఆరోపించిన క్యాబిన్ సిబ్బందిలోని సుమారు 300 మంది సిబ్బంది సెలవుపై వెళ్లారు. అనంతరం సమ్మెకు దిగడంతో అప్పటినుంచి వందలాది విమాన సర్వీసులను ఎయిరిండియా రద్దు చేసింది. తక్షణం విధుల్లోకి రాకపోతే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com