దుబాయ్‌లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- May 12, 2024
దుబాయ్: ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న 2022లోని మినిస్టీరియల్ రిజల్యూషన్ ప్రకారం.. యూఏఈలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి గోల్డెన్ రెసిడెన్సీ వీసాకు అర్హులు. అదే విధంగా గోల్డెన్ వీసాను కలిగి ఉన్న ఉద్యోగిని నియమించుకోవాలనుకునే కంపెనీ మంత్రిత్వ శాఖ నుంచి తగిన పర్మిట్ ను పొందాల్సి ఉంటుంది. అయితే, గోల్డెన్ రెసిడెన్సీ వీసా పొందకుముందు ఒక ఉద్యోగి అతని లేదా ఆమె యూఏఈ రెసిడెన్సీ వీసాలో మార్పు గురించి యజమానికి తెలియజేయాలి. ప్రస్తుత వర్క్ పర్మిట్‌ను రద్దు చేయాలి. దానితోపాటు వారి రెసిడెన్సీ వీసాను రద్దు చేయాలి. ఆ తర్వాతనే కొత్త ఉద్యోగ ఒప్పందంపై సంతకం చేయాలి. 2022 యొక్క అడ్మినిస్ట్రేటివ్ రిజల్యూషన్ నం. 38కి అనుగుణంగా యూఏఈ గోల్డెన్ రెసిడెన్సీ వీసా హోల్డర్ కోసం మానవ వనరులు మరియు ఎమిరిటైజేషన్ (MoHRE) మంత్రిత్వ శాఖ ద్వారా వర్క్ పర్మిట్ పొందవలసి ఉంటుంది. అందుకోసం చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ (గోల్డెన్) వీసా కాపీ, మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆమోదించబడిన ఉద్యోగ ఒప్పందం, అకడమిక్ సర్టిఫికెట్లతో దరఖాస్తు సమర్పించాలని మార్కెట్ నిపుణులు వెల్లడించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!