ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!

- May 13, 2024 , by Maagulf
ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!

విదేశాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ఓటర్లు! 

న్యూ ఢిల్లీ: మొత్తానికి ఈ ఎన్నికల్లో ఓటింగ్ సరళి మాత్రం అనూహ్యంగా పెరిగే అవకాశం కనిస్తుంది. ఎన్ఆర్ఐలు లక్షలు ఖర్చు పెట్టుకుని కేవలం ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారు! ఎక్కువ మంది యువ జంటలు కనిపిస్తున్నారు, సహజంగా డిమాండ్ వున్నప్పుడు ఫ్లైట్ రేట్లు అమాంతంగా పెంచేస్తుంటారు! అయినా ఎవ్వరూ వెనకడుగు వేయలేదు! ఉత్సాహంగా ఓటు కోసం వస్తున్నారు! చాలా సంతోషం వేసింది! 

తెలంగాణ ప్రవాసుల కన్నా ఆంధ్రప్రదేశ్ వాళ్లే ఎక్కువగా రావడం విశేషం!  అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటమే కారణం! రాష్ట్ర భవిష్యత్, రాష్ట్ర అభివృద్ధి కోసమే ఖర్చుకు వెనకాడకుండా కసిగా వచ్చినట్లు చాలా మంది చెప్పారు. ఏ ఒక్కరో కాకుండా కుటుంబ సభ్యులతో కలసి  రావడం మరో విశేషం! నిజంగా అభినందనీయం! ఇక్కడే ఇండియా లో ముఖ్యంగా స్థానికంగా ఉండి సెలవు రోజు ఏదొక టూర్ కు వెళ్ళేవారి కన్నా వీళ్ళు నయం! వీళ్ళను స్ఫూర్తిగా తీసుకుని అందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి! ఒక బాధ్యతగా భావించి మేలు చేసే నాయకులను ఎన్నుకోవాలి! ఈ లెక్కన చూస్తే ఓటు సరళి విపరీతంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com