షిర్డీ ఆలయం మూసివేత పై స్పందించిన సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్
- January 18, 2020
షిర్డీ:'సాయిబాబా జన్మభూమి'పై నెలకొన్న వివాదం నేపథ్యంలో ఆదివారం నుంచి షిర్డీ ఆలయం మూసివేయనున్నారని జాతీయా మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో 'సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్' స్పందించింది. బంద్ కేవలం షిర్డీ సహా చుట్టుపక్క గ్రామాలకే పరిమితమని స్పస్టం చేసింది. గ్రామస్థుల బంద్‌తో ఆలయానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. గ్రామస్థులు ఇచ్చిన బంద్ పిలుపుపై వారితో చర్చించబోతున్నామని ట్రస్ట్ అధికారులు తెలిపారు. ఆలయంలో భక్తుల దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. బాబా దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు తదుపరి కార్యాచరణ ప్రకటించేందుకు ఈరోజు సాయంత్రం గ్రామస్థులు సమావేశం కానున్నట్లు సమాచారం. దీంతో షిర్డీ ప్రాశస్య్తం తగ్గిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తాజా వివాదంపై షిర్డీ గ్రామస్థులు, బాబా ట్రస్ట్ వారు స్పందిస్తూ.. తమ ఆందోళన పాథ్రీ అభివృద్ధిపై కాదని.. సాయి జన్మస్థలాన్ని వివాదం చేయడమేనని చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!







