తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో మరో తెలంగాణ కార్మికుడి విముక్తి
- January 18, 2020
దోహా:దోహాలో తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో మరో తెలంగాణ కార్మికుడి విముక్తి కలిగింది.వివరాల్లోకి వెళితే... కరీంనగర్ జిల్లా కి చెందిన సతీష్ అనే యువకుకుడు గత 3 నెలల క్రితం హౌస్ డ్రైవర్ అని వచ్చాడు.కానీ అతనికి పశువుల కాపారిగా పని చెయ్యమని చెప్పడంతోఅతనికి ఏమి చెయ్యాలో ,ఎక్కడికి వెళ్లాలో అయోమయంలో ఉండగా ఇండియాలో సామాజిక వేత్త బసంత్ రెడ్డి కి వారి బంధువులు సంప్రదించగా .సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు,ఆవిషయం తెలంగాణ గల్ఫ్ సమితి కి తెలియడంతో హుటా హుటిన బయలుదేరి అతనిని మొదట అక్కడి నుంచి విముక్తి కల్పించి, ఆశ్రయం కల్పించారు.పాస్పోర్ట్ యజమాని దగ్గర ఉండడంతో అతినికి కాల్ చేస్తే, పోయిందని చెప్పగా ఈ విషయాన్ని భారత రాయబారి కి గల్ఫ్ సమితి బృందం ప్రత్యేకంగా కలసి విన్నవించుకుంది.ఎంబసీ బృందం వెంటనే ఖతార్ ప్రభుత్వానికి అధికార మెయిల్ చెయ్యడం తో.. ఈ కేసు దాదాపు 2 నెలలు వాయిదాలు పడుతూ ఆఖరికి యజమానికి జరిమానా విధించి ,బాధితుడి ఒరిజినల్ పాస్పోర్ట్ ఇవ్వడం తో ఈ రోజు ఆ కార్మికుడు స్వదేశానికి బయలుదేరాడు.
ముఖ్యంగా ఎంబసీ అధికారి దిరాజ్ కుమార్, ICBF ప్రతినిధి రజిని మూర్తి కి సహాయం చేసినందుకు బాధితుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.
తెలంగాణ గల్ఫ్ సమితి విన్నవించుకునేది ఏంటంటే..ఖతార్ లో ఏ ఆపద వచ్చిన మనం ఓపికతో చట్టబద్ధంగా వెళితే, సహాయం తప్పకుండా మనకు దక్కుతుంది.మీకు తెలంగాణ గల్ఫ్ సమితి అన్ని విధాలుగా సహాయం చేస్తుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







