ఫిబ్రవరి 7న వస్తున్న అన్నపూర్ణమ్మ గారి మనవడు
- January 18, 2020
స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమలను తెలియజేస్తూ...ఉమ్మడి కుటుంభాలలో వున్న అనుబంధాలను, మానవ సంబంధాలను సమ్మిళతం చేసి తెరకెక్కించిన చిత్రం "అన్నపూర్ణమ్మ గారి మనవడు". టైటిల్ పాత్రధారులుగా.సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, మాస్టర్ రవితేజ నటించగా...బాలదిత్య, అర్చన హీరో, హీరోయిన్లుగాను, మహానటి జమున ఒక కీలక పాత్రలో నటించారు. సెన్సార్ క్లీన్ యు సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగావిడుదల చేయనున్నామని నిర్మాత ఎం.ఎన్.ఆర్. చౌదరి తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, కొంతమంది మిత్రుల,శ్రేయోభిలాషుల సలహా మేరకు ఈ చిత్రాన్నిఅమృత, ప్రణయ్ లకు అంకితమిస్తున్నామని వెల్లడించారు.
దర్శకుడు నర్రా శివనాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ చిత్రంలో అక్కినేని అన్నపూర్ణమ్మగా, వైకుంఠపురం అనే గ్రామ జమిందారినిగా అన్నపూర్ణమ్మ నటన హైలైట్. మనవడి పాత్రకు మాస్టర్ రవితేజ ప్రాణం పోసాడు. అక్కినేని అనసూయమ్మగా జమున అలరిస్తారు. ఇక మిర్యాలగూడలో యథార్థంగా జరిగిన అమృత, ప్రణయ్ ప్రేమకథలో బాలాదిత్య, అర్చనలు తమ పాత్రలలో ఒదిగిపోయారు. ఇంకా,బెనర్జి, రఘుబాబు,కారుమంచి రఘు,తాగుబోతు రమేష్,సుమన్ శెట్టి,శ్రీ లక్ష్మి,సుధ,జయవాణి తదితరులంతా వారి పాత్రలకు న్యాయం చేశారు. ,సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ మ్యూజిక్ ఈ చిత్రానికి మరో హైలెట్ అని అన్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







