ఫిబ్రవరి 7న వస్తున్న అన్నపూర్ణమ్మ గారి మనవడు
- January 18, 2020స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమలను తెలియజేస్తూ...ఉమ్మడి కుటుంభాలలో వున్న అనుబంధాలను, మానవ సంబంధాలను సమ్మిళతం చేసి తెరకెక్కించిన చిత్రం "అన్నపూర్ణమ్మ గారి మనవడు". టైటిల్ పాత్రధారులుగా.సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, మాస్టర్ రవితేజ నటించగా...బాలదిత్య, అర్చన హీరో, హీరోయిన్లుగాను, మహానటి జమున ఒక కీలక పాత్రలో నటించారు. సెన్సార్ క్లీన్ యు సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగావిడుదల చేయనున్నామని నిర్మాత ఎం.ఎన్.ఆర్. చౌదరి తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, కొంతమంది మిత్రుల,శ్రేయోభిలాషుల సలహా మేరకు ఈ చిత్రాన్నిఅమృత, ప్రణయ్ లకు అంకితమిస్తున్నామని వెల్లడించారు.
దర్శకుడు నర్రా శివనాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ చిత్రంలో అక్కినేని అన్నపూర్ణమ్మగా, వైకుంఠపురం అనే గ్రామ జమిందారినిగా అన్నపూర్ణమ్మ నటన హైలైట్. మనవడి పాత్రకు మాస్టర్ రవితేజ ప్రాణం పోసాడు. అక్కినేని అనసూయమ్మగా జమున అలరిస్తారు. ఇక మిర్యాలగూడలో యథార్థంగా జరిగిన అమృత, ప్రణయ్ ప్రేమకథలో బాలాదిత్య, అర్చనలు తమ పాత్రలలో ఒదిగిపోయారు. ఇంకా,బెనర్జి, రఘుబాబు,కారుమంచి రఘు,తాగుబోతు రమేష్,సుమన్ శెట్టి,శ్రీ లక్ష్మి,సుధ,జయవాణి తదితరులంతా వారి పాత్రలకు న్యాయం చేశారు. ,సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ మ్యూజిక్ ఈ చిత్రానికి మరో హైలెట్ అని అన్నారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి