బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- May 18, 2024
అమరావతి: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పలు హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. పలు చోట్ల పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకున్న ఘటనలపై స్పందించిన ఈసీ సీరియస్‌గా చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలోని పెట్రోల్ బంకుల్లో బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలను నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ అమ్మొద్దని గతంలో పోలీసులు కూడా చెప్పారు. ఇక ఇటీవల చోటుచేసుకున్న ఘటనలో మరోసారి ఎన్నికల సంఘం ఈ ఆదేశాలను జారీ చేసింది.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కూడా పెట్రోల, డీజిల్‌ను బాటిళ్లలో అమ్మొద్దని యాజమాన్యాలకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలు.. పోలీసుల సూచనతో పెట్రోల్ బంక్ యాజమాన్యాలు కూడా అలర్ట్ అయ్యాయి. మరోవైపు వాహనాల్లో పెట్రోల్ ఉన్నట్లుండి అయిపోతే ఏంటి పరిస్థితి అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..