లాండింగ్ లో పరాజయం పొందిన ఫాల్కన్ - 9

- January 18, 2016 , by Maagulf
లాండింగ్ లో పరాజయం పొందిన ఫాల్కన్ - 9

అమెరికాకు చెందిన ప్రైవేట్‌ స్పేస్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ కంపెనీ స్పేస్‌ఎక్స్‌ తాజా ప్రయోగంలో మిశ్రమ ఫలితాలు చవిచూసింది. అమెరికాలోని కాలిఫోర్నియా సమీపంలో పసిఫిక్‌ మహాసముద్రంలోని ఫ్లోటింగ్‌ లాంచ్‌ప్యాడ్‌ ద్వారా రాకెట్‌ను ప్రయోగించారు. వాతావరణ మార్పులపై పరిశోధనలు చేసే యూఎస్‌-ఫ్రెంచ్‌ ఉపగ్రహం జాసన్‌-3 సహా 11 ఉపగ్రహాలను రాకెట్‌ విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది. కానీ తిరిగి రాకెట్‌ లాంచ్‌ప్యాడ్‌కు సురక్షితంగా చేరుకునే విషయంలో విఫలమైంది. సరిగ్గా లాంచ్‌ప్యాడ్‌కు చేరుకునే సమయంలో మంటలు వచ్చి రాకెట్‌ మొదటి భాగం కాలిపోయి కుప్పకూలింది. ఈ రాకెట్‌ ప్రయోగంలో ఉపగ్రహాలు విజయవంతంగా ప్రయోగించడం మొదటి లక్ష్యమైతే.. రెండో లక్ష్యం రాకెట్‌ను తిరిగి ఫ్లోటింగ్‌ లాంచ్‌ప్యాడ్‌పైకి సురక్షితంగా తీసుకురావడం. దీనిని డ్రోన్‌షిప్‌ అంటారు.రాకెట్‌ సురక్షితంగా ల్యాండ్‌ అయితే అందులోని భాగాలు తిరిగి ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. కానీ ఫాల్కన్‌-9 ప్రయోగంలో ఈ డ్రోన్‌షిప్‌ విఫలమైంది. ఇలా జరగడం స్పేస్‌ఎక్స్‌కు ఇది నాలుగోసారి. రాకెట్‌ వీడియోను స్పేస్‌ఎక్స్‌ సీఈఓ ఎలోన్‌ ముస్క్‌ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com