రోడ్డు ప్రమాదానికి గురైన ప్రముఖ నటి షబానా అజ్మీ..
- January 18, 2020
ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీకి రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలయ్యాయి. ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ హైవేపై ప్రయాణిస్తూ ఉండగా, ఆమె కారు అదుపుతప్పి టిప్పర్‌కు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె భర్త జావీద్ కూడా కారులోనే ఉన్నారు. డ్రైవర్‌కి కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. వెంటనే వారిని 108 వాహనంలో ఎంజీఎంకు తరలించారు. ప్రమాదం తీవ్రతకు కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయ్యింది.
'షబానా అజ్మీకి ముక్కుకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఇప్పటివరకు బయటకు కనిపించే ఇతర గాయాలు లేవు. ఆమె ప్రస్తుతం షాక్ స్థితిలో ఉన్నారు. చికిత్స జరుగుతోంది. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది' అని ఎంజిఎం హాస్పిటల్ డాక్లర్లు తెలిపారు. షబానా తన భర్త, ప్రముఖ రచయిత 75వ పుట్టినరోజును శుక్రవారం రాత్రి ముంబైలో కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







