కేరళలో 'విరాటపర్వం' షూటింగ్ లో రానా
- January 19, 2020
హ్యాండ్సం హీరో రానా దగ్గుబాటి తన తాజా చిత్రం 'విరాటపర్వం' షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం కేరళలో ప్రధాన తారాగణంపై కొన్ని ప్రధాన సన్నివేశాల్ని దర్శకుడు వేణు ఊడుగుల చిత్రీకరిస్తున్నారు. నాయికగా నటిస్తున్న సాయిపల్లవితో పాటు, ఒక కీలక పాత్ర చేస్తున్న ప్రియమణి సైతం ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తయారవుతున్న ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను పేరుపొందిన హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ స్టీఫెన్ రిచర్ ఆధ్వర్యంలో చిత్రీకరించనున్నారు.
'నీదీ నాదీ ఒకే కథ' ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని డి. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియమణి, ఈశ్వరీ రావు, జరీనా వహాబ్ కీలక పాత్రధారులైన ఈ సినిమాకు డాని సాంచెజ్-లోపెజ్ చాయాగ్రాహకునిగా పనిచేస్తున్నారు. 2020 వేసవిలో 'విరాటపర్వం'ను విడుదల చేయాలని నిర్మాతలు సంకల్పించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







