88ఏళ్ల తరవాత గుర్రాలపై గస్తీ కాయనున్న ముంబై పోలీసులు
- January 20, 2020
ముంబై పోలీసులు ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు మరోసారి పాత పద్ధతిని వాడబోతున్నారు. 1932లో గుర్రాలపై స్వారీ చేస్తూ.. విధులు నిర్వర్తించినట్లుగానే రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించనున్న పరేడ్‌లోనూ తమ గౌరవ వందనాన్ని సమర్పించనున్నారు. శివాజీ పార్క్ దీనికి వేదిక కానున్నట్లు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఆదివారం వెల్లడించారు.
1932లో పోలీసులు వీధుల్లో పెట్రోలింగ్ నిర్వహించేందుకు పోలీసులు ఈ పద్ధతిని వాడేవారు. ట్రాఫిక్, వాహనాలు పెరిగిపోవడం వల్ల వీటికి దూరమైపొయ్యాం. నేటి ముంబై పోలీసులకు మోడరన్ జీపులు, మోటర్ సైకిళ్లు వాడుతున్నారు. గుంపుగా ఉన్న ప్రాంతాల్లో క్రైమ్ పెట్రోల్ చేయడానికి ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలా చేయడం ఇదే తొలిసారి.
బీచ్ ప్రాంతాల్లో, ఎత్తైన ప్రదేశాల్లోకి పోలీసులు వెళ్లడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. గుర్రంపై ఉన్న ఒక్క పోలీసు నేలపై ఉన్న 30మందితో సమానం. వచ్చే ఆరు నెలల్లో ఒక్క సబ్ ఇన్‌స్పెక్టర్ కింద 30 గుర్రాలు ఇస్తామని అన్నారు. ప్రస్తుతం 13గుర్రాలను కొనుగోలు చేశాం. మిగిలిన వాటిని ఒక ఆరు నెలల్లో తీసుకుంటాం. వాటి కోసం అంధేరీలో 2.5ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని వెల్లడించారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







