లెబనాన్‌లో ఉద్రిక్తంగా నిరసనలు

- January 20, 2020 , by Maagulf
లెబనాన్‌లో ఉద్రిక్తంగా నిరసనలు

లెబనాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తాయి. బీరుట్‌ నగర వీధుల్లోకి నిరసనకారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. జాతీయ పతాకం, ప్లకార్డులు, బ్యానర్లు చేబూని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. రహదారులపై టైర్లు దహనం చేశారు. వాహనాల రాకపోక లను అడ్డుకున్నారు. నిరసన కార్యక్రమాల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నట్టు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు బాష్పవాయుగోళాలు ప్రయోగించాయి. లాఠీలు ఝళిపిం చాయి. ఈ ఘటనలో 160 మంది గాయపడినట్టు స్థానిక మీడియా సంస్థలు ప్రకటించాయి. నిరసనకారులు మార్టిర్‌స్క్వేర్‌ ప్రాంతానికి చేరుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు నిరసనకారులపై విరుచుకు పడ్డాయి. ఈప్రాంతం నిరసన కార్యక్రమాలకు లెబనాన్‌లో కేరాఫ్‌ సెంటర్‌గా కొనసాగుతోంది. అనంతరం నిరసన కారులు పార్లమెంట్‌ ముందు నిరసన చేపట్టేందుకు ప్రయ త్నించారు.

కాగా, లెబనాన్‌లో అవినీతి రాజ్యమేలుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పాలనపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర ధరలు మిన్నంటడంతో సామాన్యప్రజలు ఇబ్బందిపడు తున్నారు. లెబనాన్‌ ఆర్థికాభివృద్ధి మందగమనంలో కొనసాగుతోంది.

గతేడాది అక్టోబర్‌ 29న లెబనాన్‌లో దేశవ్యాప్త నిరసనలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ విధానాలపై ప్రజలు నిరసన గళం వినిపించారు. ప్రజాందోళలు హింసాత్మకంగా మారడంతో ప్రధాని సాద్‌ హరీరీ తన పదవికి రాజీనామా చేశారు. డిసెంబర్‌లో హస్సన్‌ దియాబ్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

అవినీతికి పాల్పడ్డ ఆరోపణలు ఎదుర్కొన్న పీఎం తన పదవికి రాజీనామా చేయడంతో నిరసనకారులు ఆందోళనలు విరమించారు. అయితే, దియాబ్‌ కూడా మాజీ ప్రధాని పంథానే అను సరిస్తుండటంతో ప్రజాందోళలు మరోసారి భగ్గుమన్నాయి. ట్రిపోలీ, అక్కార్‌ ప్రావిన్స్‌ల్లో నిరసనకారులు కదంతొక్కారు. ముందస్తు ఎన్నికలు నిర్వహిం చాలని డిమాండ్‌ చేశారు. నిరసనకారులు శాంతియుతంగా నిరసన తెలపాలని లెబనాన్‌ అధ్యక్షుడు మైఖెల్‌ ఔన్‌ కోరారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గకుండా చూసుకోవాలని ట్విట్టర్‌లో కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com