మరో 11 భాషల్లో లేబర్ కాంట్రాక్ట్లు

- January 18, 2016 , by Maagulf
మరో 11 భాషల్లో లేబర్ కాంట్రాక్ట్లు

యూఏఈ లేబర్‌ మినిస్ట్రీ కొత్తగా 11 భాషల్ని లేబర్‌ కాంట్రాక్టుల కోసం ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. జాబ్‌ ఆఫర్స్‌, లేబర్‌ కాంట్రాక్ట్స్‌ మరియు ఎన్నెక్సెస్‌ కోసం కొత్తగా పలు భాషల్ని గుర్తించారు. అరబిక్‌ మరియు ఇంగ్లీష్‌ జాబ్‌ ఆఫర్‌ కోసం ముఖ్యమైన భాషలుగా పరిగణించబడ్తున్నాయి. మూడో భాషగా అప్లికెంట్‌కి అర్థమయ్యే భాషకు అవకాశం కల్పించారు. బెంగాలీ, చైనీస్‌, దరి, హిందీ, మలయాళం, నేపాలీస్‌, శ్రీలంకన్‌, తమిళ్‌ మరియు ఉర్దూ భాషల్ని తాజాగా గుర్తిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమవుతుంది. కాంట్రాక్ట్‌ ఒప్పందం కుదుర్చుకునే సమయంలో ఉద్యోగులు లేదా కార్మికులు జాబ్‌ ఆఫర్స్‌ మరియు ఎన్నెక్సెస్‌ తమకు తెలిసిన భాషలో చూసుకుని, ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. నిబంధనల్ని పూర్తిగా తెలుసుకోకుండా లేబర్‌ కాంట్రాక్ట్‌పై సైన్‌ చేసినట్లు తేలితే 20,00 దిర్హామ్‌ల ఫైన్‌ విధించబడ్తుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com