శ్రమ మినహా జమ ఎరగని ప్రవాశీయులు దుబాయ్ లో సర్వే వెల్లడి
- January 18, 2016
యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ లో జీవన వ్యయం విపరీతంగా పెరగడంతో ఇతర దేశాల ఉద్యోగులు , శ్రామికులు కొంత డబ్బును దాచుకునే పరిస్థితులు నానాటికీ తగ్గిపోతున్నాయి. దీంతో వీరు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు ఒక కొత్త సర్వే సూచిస్తుంది. దుబాయి లో నివసిస్తున్న 2,200 ప్రవాశీయుల పై జరిగిన సర్వే లో 30 శాతం మంది కనీసం ఒక్క దినార్ అయినా , ఇక్కడ ఉండి దాచుకోలేకపోతున్నారు. మరో 53 శాతం మంది తమకు వచ్చే ఆదాయంలో దాచుకునేందుకు ఏమీ మిగలని పరిస్థితులు వారికి ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ నుంచి జనవరి మాసం వరుకు జరిగిన ఈ సర్వే లో పై విషయాలు వెలుగు లోనికి వచ్చాయి. వీరికి వచ్చే ఆదాయం కుటుంబం, జీవన ఖర్ఛులు మాత్రమె కాక, అత్యధిక ప్రవాశీయులలో ఆర్ధిక క్రమశిక్షణ కొరవడిందని, దీంతో పొదుపు చేసే లక్షణం చాల వరుకు తగ్గిపోతున్నాయి. దుబాయ్ లో ఉన్న ద్రవ్యోల్బణం కారణంగా గృహోపకరణాల ఖర్చు ,గృహావసారాలు, గృహోపకరణాలు , రోజువారీ ఇంటి ఖర్చుల నిర్వహణ నానాటికీ భారమవుతుంది.ఇక వసతి, నీరు, విద్యుత్ , గ్యాస్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. పలువురు ప్రవాశీయులు దుబాయ్ లో కొంత సంపాదించాలనే లక్ష్యంతో వస్తున్నారని , కాని ఇక్కడ అధిక జీవనవ్యయం కారణంగా ఎందరో నిరాశా చెందుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







