రష్యా:అగ్నిప్రమాదంలో 11మంది కార్మికులు మృతి
- January 22, 2020
రష్యా:సైబీరియాలోని ఓ టింబర్ డిపోలో అగ్నిప్రమాదం జరిగి 11 మంది కూలీలు చనిపోయారు. మృతుల్లో 10 మంది ఉజ్బెకిస్తాన్‌కు చెందినవారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
మధ్య ఆసియాకు చెందిన లక్షలమంది వలస కూలీలు రష్యాలో పనులు చేస్తూ జీవిస్తున్నారు. ప్రిచులిమ్‌స్కై సెటిల్మెంట్‌లోని ప్రైవేటు టింబర్ డిపోలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు డిపో అంతటికీ వ్యాపించాయి. కూలీలు తేరుకొని బయటికి పరుగెత్తేలోపే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి.. కారకులైనవారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







