'గామా 2015'
- January 18, 2016
తెలుగు సినీ ప్రపంచానికి తలమానికంగా నిలిచే ప్రతిష్టాత్మక పురస్కారాలు - 'గామా' గల్ఫ్ ఆంధ్రా మ్యూజికల్ అవార్డ్స్! దుబాయ్ లోని తెలుగువారు, ఈటివి కలిసి వరుసగా 3వ ఏడాది నిర్వహిస్తున్న ఈ అవార్డులు సంగీత ప్రియుల్లోనూ, సినీపరిశ్రమలోనూ ఉత్కంఠను రేకెత్తిస్తూ, ప్రతి ఏడాది సరికొత్త స్థాయిని అందుకుంటున్నాయి.
ఇప్పుడు 2015 గామా అవార్డుల కార్యక్రమానికి తరుణం ఆసన్నమైంది.
2016 ఫిబ్రవరి 12న దుబాయ్ లోని జబీల్ పార్క్ వేదికగా గామా అవార్డుల ప్రదానోత్సవానికి ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
ఈసారి 'గామా'' విశిష్ట ప్రత్యేకత ఏమిటంటే.. విజేతలను నిర్ణయించడానికి గ్రాండ్ జ్యూరీ ఎర్పాటు కావడం. ఈ జ్యూరీకి చైర్మన్ గా తెలుగు చలనచిత్ర చరిత్రలో అగ్రశ్రేణి దర్శకుడిగా పేరుపొందిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు వ్యవహరించడం. ఆయనతో పాటు వివిధరంగాల నుంచి నిష్ణాతులు కూడా ఈ జ్యూరీలో సభ్యులుగా ఉన్నారు. సంగీత దర్శకత్వ శాఖ నుంచి సీనియర్ డైరెక్టర్ కొటి, నేపధ్య గాయకుల నుంచి మనో, గీత రచయితల నుంచి చంద్రబోస్ లు ఈ జ్యూరీ కి సభ్యులుగా ఉన్నారు.
2015 సంవత్సరంలో విడుదలైన చిత్రాల నుంచి ఈ గ్రాండ్ జ్యూరీ నిర్ణయించిన ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గాయని, ఉత్తమ గాయకుడు, ఉత్తమ బ్యాక్ గ్రౌండ్ సంగీతం, ఉత్తమ గీత రచన తదితర కెటగరీలలొ అవార్డులు అందిస్తామని గామా అవార్డుల చైర్మన్ కేసరి త్రిమూర్తులు గారు తెలిపారు.
వీటితో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన గామా జీవన సాఫల్య పురస్కారాన్ని 2015 సంవత్సరానికి ప్రఖ్యాత నటుడు రెబెల్ స్టార్ కృష్ణం రాజు గారికి అందించబోతున్నారు.
2015 'గామా' పురస్కారాలకు కొత్త స్థాయిని, గౌరవాన్ని కల్పించేలా 'మూవీ ఆఫ్ ది ఇయర్' పురస్కారాన్ని కూడా అందించాలని ఈటివి సంకల్పించింది.
2015 సంవత్సరంలో తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన బాహుబలి చిత్రాన్ని ఈటివి - గామా మూవీ ఆఫ్ ది ఇయర్ గా ఎంపిక చేసారు. ఈ చిత్ర నిర్మాతలు శోభు యార్లగడ్డ - ప్రసాద్ దేవినేని మాట్లాడుతూ విదేశాలలో బాహుబలి అవార్డును అందుకోవడం ఇదే తొలిసారి అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసారు. నిర్మాతలతో పాటు ప్రభాస్, రాణా, తమన్నా; చిత్రంలో నటించిన ప్రభాకర్ తదితరులు కూడా దుబాయ్ లో పురస్కార ఉత్సవానికి హాజరు కాబోతున్నారు.
వీరితో పాటు విభిన్న చిత్రంగా ప్రసంసలు పొందిన 'కంచె' చిత్ర సభ్యులు - దర్శకుడు క్రిష్, హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ ప్రజ్ఞ జైస్వాల్ కూడా ఈ ఫంక్షన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు.
తన సంగీతంతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే డైనమిక్ దేవిశ్రీప్రసాద్, యంగ్ మ్యూజికల్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, విభిన్న సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ, గీత రచయిత భాస్కర భట్ల తదితరులు ప్రదానోత్సవంలో పాలుపంచుకోబోతున్నారు.
'ఇది తెలుగు పాటకు పట్టాభిషేకం. గామా అవార్డులంటే తెలుగు లో గ్రామి, ఆస్కార్ అవార్డుల స్థాయికి చేరుకోవాలి' అని ఆశాభావం వ్యక్తం చేసారు కోటి.
ప్రముఖ గాయకుడు మనో, ప్రఖ్యాత యాంకర్ సుమ లు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వీరితో పాటు గల్ఫ్ లోని వేలాది తెలుగు ప్రేక్షకుల్ని తన్మయుల్ని చేయడానికి టాలీవుడ్ గాయకులు సునీత, కల్పన, గీతామాధురి, హేమచంద్ర, దీపు, జెస్సి గిప్ట్, టెలివిజన్ స్టార్స్ రేష్మి, యమున, హరితేజ, కౌశిక్, అనిల్, నవ్య, నిరుపమ్ తదితరులు ప్రత్యేక కార్యక్రమాలు సమర్పించబోతున్నారని 'గామా' ఇండియా ప్రతినిధి ఫణిమాధవ్ తెలిపారు.










తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







