కత్రినా కైఫ్ పెళ్లి..

- January 24, 2020 , by Maagulf
కత్రినా కైఫ్ పెళ్లి..

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ పెళ్లి చేసుకుంది. కళ్లుమిరుమిట్లు గొలిపేలా ఏర్పాటు చేసిన కళ్యాణ మంటపంలో అందంగా అలంకరించుకున్న అమ్మాయి కత్రినాను అమ్మానాన్న జయాబచ్చన్, అమితాబ్ చేయి పట్టుకుని పెళ్లి పీటల మీదకు తీసుకువెళుతున్నారు. ముఖ్య అతిధులుగా టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున, కన్నడ హీరో శివరాజ్ కుమార్, తమిళ్ నటుడు ప్రభు పెళ్లికి విచ్చేశారు.

నిజంగానే పెళ్లిని తలపించిన ఈ సీను ఓ నగల దుకాణానికి సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్. ఈ షోరూమ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న కత్రినతో ఓ యాడ్ రూపొందించింది. అదే నగల దుకాణానికి తెలుగులో నాగార్జున, తమిళంలో ప్రభు, కన్నడలో శివరాజ్ కుమార్ ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు బాలీవుడ్ నటుడు అమితాబ్ ఆయన సతీమణి జయాబచ్చన్ కూడా బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు.

అందరినీ కలిపి ఈయాడ్‌ని రూపొందించింది బంగారు నగల దుకాణం. ఇందుకు సంబంధించిన ఫోటోలను అమితాబ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పలు చిత్ర పరిశ్రమలకు చెందిన అగ్ర కధానాయకుల కుమారులతో నటించడం ఆనందంగా ఉందని అమితాబ్ పేర్కొన్నారు. వీరితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని అమితాబ్ అన్నారు. ఈ ఫోటోలు నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com