రెండేళ్ళ బ్యాన్: కఠినంగా అమలు
- January 18, 2016
ఉద్యోగాన్ని లేదా పనిని దాంతోపాటుగా ఒమన్‌ని విడిచిపెట్టాలనుకుంటే, ఇకపై రెండేళ్ళపాటు తిరిగి ఒమన్ వచ్చే అవకాశం లేకుండా కఠిన చర్యలు తప్పవని ఒమన్ అధికారిక వర్గాలంటున్నాయి. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉన్నా, రెండేళ్ళ బ్యాన్ తప్పనిసరని వారు చెప్పారు. ఈ వివాదంలో ఎన్‌ఓసీ లెటర్ ఏమాత్రం పనికిరాదని ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసిందని రాయల్ ఒమన్ పోలీసు అధికారి వివరించారు. అయితే ఏ సంస్థ నుంచి అయితే పని మానేయాలనుకున్నాడో, తిరిగి అదే సంస్థలో ఆ వ్యక్తి చేరాలనుకుంటే మాత్రం రెండేళ్ళ బ్యాన్ వర్తించదని అధికారులు చెప్పారు. ఇప్పటికే పలు కంపెనీలు వలస కార్మికులు, ఉద్యోగుల్ని చేర్చుకునేందుకు ప్రయత్నించగా, వారిపై రెండేళ్ళ బ్యాన్ అమల్లో ఉన్న కారణంగా వీసా తిరస్కరించబడినట్లు ఆయా కంపెనీలకు చెందిన అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







