డిస్కోరాజాకు సక్సెస్ ఫుల్ గా అన్ని థియేటర్స్ లో ప్రదర్షింపబడుతోన్న చిత్రం !!!
- January 27, 2020
మాస్ మహారాజా రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘డిస్కోరాజా’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. మౌత్ టాక్‌తో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని చెప్పవచ్చు. తొలిరోజుతో ఈ వీకెండ్ మొత్తం థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. కొత్త సైన్స్ ఫిక్షన్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నభానషేష్, పాయల్‌రాజపుత్, తానియా, బాబిసింహా, సునీల్ తదితరులు నటించారు. రామ్‌తాళ్ళూరి నిర్మించిన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతొంది.
24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి యావరేజ్ రేటింగ్స్ వచ్చినా సరే ప్రేక్షకుల నుండి పాజిటీవ్ రెస్పాన్స్ లభిస్తోంది, ముఖ్యంగా రోజురోజుకు జనాధారణ పొందుతూ డిస్కోరాజా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఆదివారం చిత్ర యూనిట్ థియేటర్స్ విజిట్ చేశారు, అక్కడ ఆడియన్స్ రెస్పాన్స్ లైవ్ లో చూసిన చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేశారు.
సడన్ గా చిత్ర కలెక్షన్స్ పెరగడంతో థియేటర్స్ పెరిగే అవకాశం ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డిస్కోరాజా రానున్న రోజుల్లో మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







