శర్వానంద్ 'శ్రీకారం' ఏప్రిల్ 24 విడుదల
- February 01, 2020
యంగ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ మూవీ 'శ్రీకారం' షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం దీని షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.
ఇటీవల చిత్ర బృందం ఆవిష్కరించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు చాలా మంచి స్పందన వచ్చింది. తాజాగా నిర్మాతలు సినిమా విడుదల తేదీ ప్రకటించారు. ఏప్రిల్ 24న 'శ్రీకారం' ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
సినిమాల విడుదలకు సమ్మర్ అతి పెద్ద సీజన్ అనే విషయం తెలిసిందే. 'శ్రీకారం'తో సమ్మర్ హాలిడేస్ ను క్యాష్ చేసుకోవడానికి శర్వానంద్ రెడీ అవుతున్నారు. కిషోర్ బి. డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో శర్వానంద్ జోడీగా 'గ్యాంగ్ లీడర్' ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది.
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ మూవీని నిర్మిస్తున్నారు. 'గద్దలకొండ గణేష్' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వాళ్లకు ఇది రెండో చిత్రం.
'గద్దలకొండ గణేష్' మూవీతో మాస్ ట్యూన్స్ కూడా ఇస్తానని నిరూపించుకొని మంచి ఫామ్ లో ఉన్న మిక్కీ జె మేయర్ 'శ్రీకారం'కు వినసొంపైన బాణీలు అందిస్తున్నారు. పేరుపొందిన రైటర్ సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తుండగా, జె. యువరాజ్ సినిమాటోగ్రాఫర్ గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.
తారాగణం:
శర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్, రావు రమేష్, ఆమని, సీనియర్ నరేష్, సాయికుమార్, మురళీ శర్మ, సత్యా, సప్తగిరి
సాంకేతిక వర్గం:
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట
డైరెక్టర్: కిషోర్ బి.
మ్యూజిక్: మిక్కీ జె మేయర్
సినిమాటోగ్రఫీ: జె. యువరాజ్
డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా
ఆర్ట్: అవినాష్ కొల్లా
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







