డిసెంబర్ 11న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 'మైదాన్'
- February 03, 2020
భారత దేశాన్ని ఫుట్ బాల్ రంగంలో ప్రపంచ పటంలో నిలిపిన ఫుట్ బాల్ కోచ్ యధార్థ కథ ఆధారంగా స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న చిత్రం `మైదాన్`.ఇప్పటికే విడుదలైన టీజర్ పోస్టర్స్ కి మంచి అప్రిసియేషన్ వస్తోన్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి మరో రెండు పోస్టర్స్ ను విడుదలచేసింది చిత్ర యూనిట్. ఈ పర్ఫెక్ట్ పీరియాడిక్ పోస్టర్స్ లో ఫుట్ బాల్ కోచ్ గా అజయ్ దేవగన్ లుక్ ఆకట్టుకుంటోంది. క్రీడా నేపథ్యంలో ఒక స్ఫూర్తిమంతమైన కథగా `మైదాన్`ను నిర్మిస్తున్నారు.
బధాయి హో వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కోల్ కత్తా, లక్నో, ముంబై నగరాల్లో 50 రోజులు పాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఏప్రిల్ కి చిత్రీకరణ పూర్తి చేసి డిసెంబర్ 11న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలచేయనున్నారు.
నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి, బధాయి హో ఫేమ్ గజరాజ్ రావు, పాపులర్ బెంగాలీ యాక్టర్ రుద్రనిల్ ఘోష్ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్న మైదాన్ ని ఫ్రెష్‌లైమ్ ఫిల్మ్ సహకారంతో జీ స్టూడియోస్ బేనర్‌పై బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరునవ జాయ్ సేన్ గుప్తా నిర్మిస్తున్నారు. సైవిన్ కాద్రస్, రితేష్ షా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ను అందిస్తున్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







