మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ గా అఖిల్.!
- February 05, 2020
అఖిల్ అక్కినేని సినిమాకు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' టైటిల్ ఖరారు చేశారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. కథకు తగినట్టుగా టైటిల్ నిర్ణయిం చినట్టు నిర్మాతలు వెల్లడించారు. ఈ సినిమా యూత్‌ని అలరించడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌ని సైతం ఆకట్టుకుంటుం దన్నారు. అఖిల్ అక్కినేనికి ఇది నాలుగవ చిత్రం. ఇతర పాత్రల్లో ఆమని, మురళిశర్మ, జయప్రకాశ్, ప్రగతి, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం గోపీసుందర్, ఛాయాగ్రహణం ప్రదీశ్ ఎమ్ వర్మ.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







