నరేష్ పుట్టినరోజు వేడుకలకు విజయ నిర్మల, సూపర్ స్టార్ కృష్ణ ముఖ్య అతిథులు..
- January 20, 2016
ముఖ నటుడు నరేష్ పుట్టినరోజు వేడుకలు బుధవారం అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా జరిగాయి. ఈ వేడుకలకు నరేష్ తల్లి విజయ నిర్మల, సూపర్ స్టార్ కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, శివాజీ రాజా తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా కృష్ణ మాట్లాడుతూ...నరేష్ తన కెరీర్లో ఎక్కువగా కామెడీ సినిమాలు చేసినప్పటికీ సాహసమే నా ఊపిరి లాంటి యాక్షన్ సినిమాలు కూడా చేసారు. ఇపుడు సెకండ్ ఇన్సింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్టార్ డమ్ తెచ్చుకున్నారు. నరేష్ మరిన్ని మంచి పాత్రలు చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.నరేష్ మాట్లాడుతూ... కృష్ణ గారు, అమ్మ విజయ నిర్మల ఇద్దరు నా కెరీర్ కు రెండు పిల్లర్స్ లా నిలిచారు. ప్రస్తుతం కెరీర్ చాలా హ్యాపీగా సాగుతోంది. మహేష్ తో నటించాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. బ్రహ్మోత్సవం సినిమాతో అది నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో తొలిసారిగా 'అ ఆ' సినిమాలో నదితో కలిసి చేస్తున్నాను. సినిమాకు మలుపు తిప్పే కీ రోల్ చేస్తున్నాను. ఆదితో కలిసి చేసిన 'గరం' త్వరలో రిలీజవుతోంది. అలాగే కొత్త దర్శకురాలు చూనియా దర్శకత్వంలో 'పడేసావే' చిత్రంలో చేస్తున్నాను. కృష్ణ గారు నటిస్తున్న 'శ్రీ శ్రీ'లో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నాను. ఈ ఏడాది నాకు నటుడిగా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. మాబ్బాయి నవీన్ నటిస్తున్న 'ఐనా ఇష్టం నువ్వు' ఈ సంవత్సరం రిలీజ్ అవుతుంది అన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







