'కృష్ణగాడి వీర ప్రేమగాథ' ఆడియో రిలీజ్..

- January 20, 2016 , by Maagulf
'కృష్ణగాడి వీర ప్రేమగాథ' ఆడియో రిలీజ్..

ప్రముఖ హీరో నాని, మెహరీన్ జంటగా నటిస్తున్న చిత్రం 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' ఆడియో రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో బుధవారం జరిగింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రిన్స్ మహేశ్ బాబు, సుకుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన హీరో మహేశ్ బాబు.. 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' సినిమా నిర్మిస్తున్న 14 రీల్స్ అంటే తనకు సొంత బ్యానర్ లాంటిదని పేర్కొన్నారు. ఈ సినిమాలో నాని నటన అద్భుతమని, చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. ఈ సినిమాలో నటించిన ముగ్గురు పిల్లలు చాలా బాగున్నారని మహేశ్ బాబు అభినందించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com