టైగర్ఎయిర్ నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక ఆఫర్..
- January 20, 2016
సింగపూర్‌కు చెందిన చౌకధర విమానయాన సంస్థ టైగర్ఎయిర్ నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. హైదరాబాద్ నుంచి సింగపూర్ రానుపోను టికెట్ ధరను రూ.11,599గా నిర్ణయించింది. ఈ ప్రత్యేక ఆఫర్ పరిధిలోకి రావాలంటే ప్రయాణికుడు ఈ నెల 31లోపు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా బుకింగ్ చేసుకున్న వారు మార్చి 9 నుంచి ఏప్రిల్ 16 లోపు ప్రయాణం చేయాల్సి ఉంటుందని కంపెనీ డైరెక్టర్ చౌహన్ తెలిపారు. అన్ని పన్నులు కలుపుకొని టికెట్ ధరను నిర్ణయించినట్లు, ప్రయాణికులు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంచేశారు. సింగపూర్‌ను సందర్శించే భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో సంస్థ మరో రెండు నూతన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు.ఏప్రిల్ 25 నుంచి జూన్ 15 మధ్యకాలంలో హైదరాబాద్, తిరుచిరాపల్లి నుంచి వారానికి ఒక సర్వీసును నడుపనున్నట్లు ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







