హార్దిక్ పటేల్ మిస్సింగ్..! ఇది బీజేపీ కుట్రే అంటున్న భార్య
- February 14, 2020
పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ కనిపించకుండా పోయాడట... దాదాపు 20 రోజుల నుంచి ఆయన కనిపించడం లేదట.. ఈ మేరకు ఆయన భార్య కింజాల్ పటేల్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. తన భర్తను గుజరాత్ పాలకులు టార్గెట్ చేశారని.. దీంతో, 20 రోజులుగా ఆయన ఆచూకీ తెలియడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పాటిదార్ ఉద్యమ సమయంలో పెట్టిన కేసులను తిరగతోడి తన భర్త ఒక్కడినే టార్గెట్ చేశారని ఆమో వీడియోలో ఆరోపించారు.. గతంలో పాటిదార్ ఉద్యమంలో పనిచేసిన మరో ఇద్దరు.. బీజేపీలో చేరడంతో వారిపై కేసులు ఎత్తివేశారని.. కానీ, ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోన్న హార్దిక్ పటేల్‌ను వదలడంలేదన్నారు. ఇక, రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో హార్థిక్ పటేల్ ను జైలుకు పంపించేందుకు గుజరాత్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు కింజాల్ పటేల్.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







