బహ్రెయిన్: ఫైనల్ ఫిటీషన్ ఛాన్స్ కొల్పోయిన టెర్రరిస్ట్ గ్రూప్..యావజ్జీవ శిక్ష ఖరారు

బహ్రెయిన్: ఫైనల్ ఫిటీషన్ ఛాన్స్ కొల్పోయిన టెర్రరిస్ట్ గ్రూప్..యావజ్జీవ శిక్ష ఖరారు

బహ్రెయిన్ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న 12 మందికి గతంలో విధించిన శిక్షలు ఖరారయ్యాయి. గతంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటీషన్ ను కోర్ట్
ఆఫ్ కసెషన్ కొట్టివేసింది. దీంతో శిక్ష నుంచి తప్పించుకునేందుకు టెర్రరిస్ట్ గ్యాంగ్ కు ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి. టెర్రరిస్ట్ సెల్ ఏర్పాటు తో పాటు కిడ్నాప్, టార్చరింగ్, దేశంలో టెర్రరిస్ట్ ప్రమోషన్ కు సాయం అందించటం, దోపిడి, వేధింపులు ఇలా పలు రకాల అభియోగాలతో 12 మందికి గతంలో శిక్షలు ఖరారయ్యాయి. ఇందులో ఇద్దరికి యావజ్జీవ కారగార శిక్ష పడగా 8 మందికి 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. మరో ఇద్దరికి పదేళ్ల జైలు శిక్ష పడింది. కోర్టులో రికార్డులు ప్రకారం..12 మంది కలిసి 'సిక్రెట్ ఇంటలిజెన్స్ సర్వీస్ ఆఫ్ బహ్రెయిన్ రెవల్యూషన్' పేరుతో టెర్రరిస్ట్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు. యువతను ఉగ్రవాదం వైపు అకర్షించేలా ప్రేరేపించటంతో పాటు పలు అరాచకాలకు పాల్పడుతూ వస్తున్నారు. ముఖ్యంగా పోలీసులకు సహకరించే వ్యక్తులను టార్గెట్ చేసేవారు. వారిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేయటంతో పాటు ఫ్యూచర్ లో పోలీసులకు సహకరించొద్దని బెదిరించేవారు. ఉగ్రవాదానికి అనుకూలించేలా వారితో కన్ఫెక్షన్ చెప్పించేవారని ఆరోపణలు ఉన్నాయి. వేర్వేరు ఘటనల్లో పోలీసులకు కోఅపరేట్ చేసే నలుగురు వ్యక్తుల్ని కిడ్నాప్ చేసి టార్చర్ చేసినట్లు పోలీసుల ఇన్వేస్టిగేషన్ లో తేలింది.

Back to Top