ఒత్తిడికీ క్యాన్సర్‌కి సంబంధముందా?
- January 20, 2016
యూఏఈలో సగానికి పైగా ప్రజానీకంలో ఒత్తిడి, క్యాన్సర్‌కి కారణం అనే భావన ఉంది. 'ది మెడికల్ సిటీ' నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది. జన్యు పరంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువనే భావనను కూడా కలిగి ఉన్నారని సర్వేలో తేలింది. అయితే అమెరికన్ క్యాన్సర్ సొసైటీ, కేవలం 5 నుంచి 10 శాతం మాత్రమే జన్యు పరంగా క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. 52 శాతం మంది ఒత్తిడి కారణంగా క్యాన్సర్ వస్తుందని విశ్వసిస్తంటే, 46 శాతం మంది జన్యుపరంగా క్యాన్సర్ సంక్రమిస్తుందని అభిప్రాయపడ్డారని, 68 శాతం మంది క్యాన్సర్‌ని నివారించగలమని చెప్పారనీ సర్వే నిర్వహించిన సంస్థ ప్రకటించింది. క్యాన్సర్‌ని నివారించేందుకు 21 శాతం మంది ఫిజికల్ యాక్టివిటీస్ మేలని చెప్పగా, 17 శాతం మంది జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండటం మంచిదని అన్నారు. ప్రతియేటా 14 మిలియన్ క్యాన్సర్ కేసులు కొత్తగా వెలుగు చూస్తున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. అలాగే, క్యాన్సర్ చికిత్స కోసం సరికొత్త మందులు ఎప్పటికప్పుడు వస్తున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







