ఒమన్ ఆర్థిక రంగానికి 'వ్యాట్' ఊతం
- January 20, 2016
2017 ప్రధమార్ధంలో వ్యాట్ అమల్లోకి రానుందని, వ్యాట్ రాకతో ఒమన్ ఆర్థిక రంగానికి ఊతం లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. వ్యాట్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైన ప్రక్రియ తుది దశలో ఉందని తాఫిక్ అల్ లవాతి చెప్పారు. ముడి చమురు ధరల పతనం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందనీ, ఈ పరిస్థితుల్లో వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) ప్రవేశపెట్టడమే మార్గమని ఒమన్ సహా, ఇతర దేశాలు అభిప్రాయపడ్తున్నాయని అధికారులు చెప్పారు. జిసిసి దేశాల్లోని ప్రభుత్వాలు వ్యాట్‌ని అమలు చేసే విధానాలపై కసరత్తు చేస్తున్నాయి. వ్యాట్ పన్ను 3 నుంచి ఐదు శాతం వరకు ఉండనుంది. వ్యాట్ పెంపుతో 200 నుంచి 300 మిలియన్ ఒమన్ రియాల్స్ అదనంగా ఆర్థిక రంగానికి చేరతుందని షురా మెంబర్ చెప్పారు. ఇప్పటికే పలు రంగాల్లో పన్నుల పెంపు ద్వారా ఆర్థిక రంగానికి ఊతమిచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కార్పొరేట్ ట్యాక్స్‌ని 12 నుంచి 15 శాతానికి ఇప్పటికే పెపంచడం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







