పునాదిరాళ్లు దర్శకుడు రాజ్ కుమార్ మృతి
- February 15, 2020
మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం ‘పునాదిరాళ్లు’ చిత్ర దర్శకుడు గుడిపాటి రాజ్ కుమార్ శనివారం ఉదయం మృతిచెందారు. ఆయనకు కూడా ఇది మొదటి సినిమా . మొదటి సినిమాకే ఐదు నంది అవార్డులు దక్కించుకున్నారు. అటువంటి దర్శకుడు, నిర్మాత రాజ్ కుమార్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషషం తెలిసి ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ఆయనకు అపోలో ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆ మధ్య ఆయన పెద్ద కుమారుడు కూడా అనారోగ్యంతో మృతి చెందడం, ఆ తర్వాత భార్య చనిపోవడంతో రాజ్ కుమార్ ఒంటరివాడు అయ్యాడు. పైసా సంపాదన లేక అద్దె ఇంట్లో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న శనివారం ఉదయం మృతిచెందారు. ఆయన స్వగ్రామం విజయవాడ సమీపంలోని ఉయ్యూరు. ఆయన భౌతికకాయాన్ని ఉయ్యూరు కు తీసుకు వెళ్ళేందుకు చిన్న కుమారుడు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







