బహ్రెయిన్ ఇంటర్నేషన్ ఎయిర్‌షో ప్రారంభం
- January 21, 2016
కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ షోను ప్రారంభించారు. మిడ్ ఈస్ట్ మరియు యూరోప్ నుంచి పలువురు మంత్రులు, ఏవియేషన్ సంస్థల ప్రతినిథులు, ఎయిర్ పవర్ చీఫ్స్ మరియు టాప్ లెవల్ ఎగ్జిక్యూటివ్స్ బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో పాల్గొంటున్నారు. కెఎస్‌ఏ, యూఏఈ, ఖతార్, కువైట్, ఒమన్, ఈజిప్ట్, జోర్డాన్, లెబనాన్, మొరాకో, టర్కీ, యూఎస్‌ఏ, చెక్ రిపబ్లిక్, జార్జియా, ఇండియా, రష్యా, ఫ్రాన్స్, హంగేరీ, యూకే, యూఎస్, టర్కీ మరియఱు బ్రెజిల్ దేశాలకు చెందిన హైలెవల్ డెలిగేషన్స్ ఈ ఈవెంట్‌లో పాలుపంచుకుంటారు. లోహ విహంగాల విన్యాసాలు ఆహూతుల్ని అలరించనున్నాయి. 100కి పైగా ఎయిర్ క్రాఫ్ట్స్ ట్రేడ్ షో కోసం డిస్‌ప్లే చేయబడ్డాయి. సౌదీ హాక్స్, యూఏఈ అల్ ఫుర్సాన్, ఇండియాకి చెందిన సరంగ్ హెలికాప్టర్ డిస్‌ప్లే టీమ్, మార్క్ జెఫ్రీస్ మరియు ట్విస్టర్ ఏరోబాటిక్స్ టీమ్ ప్రధాన ఆకర్షణలు కానున్నాయి. బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ స్పెషల్ పోర్సెస్ ప్యారాచూట్ టీమ్ ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







