జీ5 లో ఉగాది కానుకగా 'అమృతం 2.0
- February 23, 2020
తెలుగులో మోస్ట్ సక్సస్‌ఫుల్ సీరియల్‌గా పేరుగాంచిన ‘అమృతం’కు సీక్వెల్ రానుంది. హర్షవర్ధన్, శ్రీమన్నారాయణ, వాసు ఇంటూరిలతో పాటు సీనియర్ నటుడు ఎల్బీ శ్రీరామ్, సత్యకృష్ణలు ఈ కొత్తదానిలో మన చేత నవ్వులు పూయించడానికి వచ్చేస్తున్నారు. ఈ ద్వితీయ భాగానికి గుణ్ణం గంగరాజు కథను అందిస్తుండగా.. సందీప్ దర్శకత్వం వహిస్తున్నాడు. లైట్ బాక్స్ మీడియా బ్యానర్ నిర్మిస్తున్న ఈ ‘అమృతం 2.0’ ఉగాది కానుకగా మార్చి 25న జీ5 ద్వారా అందుబాటులోకి రానుంది.
‘అమృతం’ సీరియల్‌లో అమృతరావు క్యారెక్టర్‌లో శివాజీరాజా, నరేష్, హర్షవర్ధన్‌లు కనిపించగా.. ఆంజనేయులు పాత్రలో గుండు హనుమంతరావు నటించి మెప్పించారు. ఆయన మరణించడంతో ఆ ప్లేస్‌లో సీనియర్ యాక్టర్ ఎల్బీ శ్రీరామ్‌ను తీసుకున్నారు. ఈ సీరియల్‌లో అంజి పాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ పాత్రలో శ్రీరామ్ ఒదిగిపోతారని అందరూ అనుకుంటున్నారు. ‘అమృతం ద్వితీయం’.. మూర్ఖత్వానికి మరణం లేదు అనే క్యాప్షన్‌తో ఈ సీరియల్ వస్తోంది.
ఇదిలా ఉంటే అమృతం మొదటి భాగానికి ఇప్పటికే యూట్యూబ్‌లో మిలియన్స్‌లో వ్యూస్ వచ్చాయి. ఇటీవలకు జీ5 ద్వారా ఇది అందుబాటులో ఉంచినా.. ప్రేక్షాధారణ మాత్రం తగ్గలేదు. కాగా, అమృతం, అంజి, సర్వం, అప్పాజీ క్యారెక్టర్ల ఆధారంగా వస్తోన్న రెండో భాగంపై అందరిలో ఆసక్తి నెలకొంది. చూడాలి మరి ఈ ద్వితీయం ఎంతమేరకు మెప్పిస్తుందో.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







