దుబాయ్:రెంటల్ బైస్కిల్ సర్వీస్ ప్రారంభించిన ఆర్టీఏ

దుబాయ్:రెంటల్ బైస్కిల్ సర్వీస్ ప్రారంభించిన ఆర్టీఏ

దుబాయ్ లో బైస్కిల్ రెంటల్ సర్వీస్ ప్రారంభమైంది. రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ అండ్ కరీమ్ సంస్థ అఫిషియల్ గా తొలి బైస్కిల్ రెంటల్ సర్వీస్ ను లాంఛ్ చేసింది. స్టార్టింగ్ ఫేజ్ లో దుబాయ్ లోని 78 స్టేషన్స్ ఏర్పాటు చేసి 780 బైస్కిల్స్ ను ప్రజలకు రెంట్ ఇవ్వనున్నారు. రాబోయే రోజుల్లో స్టేషన్స్ సంఖ్యను 78 నుంచి 350 వరకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. బైస్కిల్స్ ను 3,500 వరకు పెంచనున్నారు. ఒక్కసారి మెంబర్ షిప్ తీసుకున్న తర్వాత బైస్కిల్స్ అద్దెకు తీసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.
డైలీ మెంబర్ షిప్ Dh20, వీక్లీ మెంబర్ షిప్ Dh50, నెలవారి మెంబర్ షిప్ Dh75, ఇయర్లీ మెంబర్ షిప్ కాస్ట్ ను Dh420 గా నిర్ణయించారు. బైస్కిల్ ను రెంట్ తీసుకున్న తర్వాత 45 నిమిషాల పాటు రైడ్ చేయవచ్చు. ఆ తర్వాత ప్రతి 30 మినిట్స్ అడిషనల్ టైంకి Dh10 ఛార్జ్ వేస్తారు.

 

Back to Top