ఆయిల్‌ కన్సెషన్‌ ఏరియాలో అగ్ని ప్రమాదం.. పరిస్థితి అదుపులోకి!

- February 24, 2020 , by Maagulf
ఆయిల్‌ కన్సెషన్‌ ఏరియాలో అగ్ని ప్రమాదం.. పరిస్థితి అదుపులోకి!

మస్కట్‌: దహిరాహ్‌ గవర్నరేట్‌లోని ఆయిల్‌ కన్సెషన్‌ ఏరియాలో జరిగిన అగ్ని ప్రమాదంపై పబ్లిక్‌ అథారిటీ ఆఫ్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ ఓ ప్రకటన చేసింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే వుందని పిఎసిడిఎ ఓ ప్రకటనలో పేర్కొంది. పెట్రోలియం వేస్ట్‌కి సంబంధించి అగ్ని ప్రమాదం చోటు చేసుకుందనీ, సదరు కంపెనీకి చెందిన ఫైర్‌ ఫైటింగ్‌ టీవ్స్‌ు సకాలంలో మంటల్ని అదుపులోకి తెచ్చాయనీ, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని పిఎసిడిఎ తన ప్రకటనలో వివరించింది. ఈ ఘటనపై సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పిఎసిడిఎ వివరణ ఇచ్చింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com