మోతెరాలో 'నమస్తే' అంటూ ట్రంప్ స్పీచ్..
- February 24, 2020
అహ్మదాబాద్: మోతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమం జరుగుతోంది. సందర్శకులతో మోతెరా స్టేడియం కిక్కిరిసిపోయింది. కాగా భారత పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మోతెరా స్టేడియంలో భారత ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మొదటగా 'నమస్తే' అంటూ ట్రంప్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశాభివృద్ధి కోసం ప్రధాని మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని ట్రంప్ అన్నారు. ఇండియాకు రావడం గౌరవంగా భావిస్తున్నానని.. నా నిజమైన మిత్రుడు మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్న అని అన్నారు.
మోతెరా స్టేడియం చాలా అద్బుతంగా ఉందన్నారు. ఈ అతిపెద్ద స్టేడియాన్ని ప్రారంభించడం సంతోషకరమని ట్రంప్ పేర్కొన్నారు. తమ హృదయంలో భారత్‌కు ఎప్పుడూ ప్రత్యేక స్థానముంటుందన్నారు. చాయ్ వాలాగా జీవితాన్ని ప్రారంభించిన మోదీ స్పూర్తి ప్రదాత అన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ పురోగమిస్తోందిన డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మోదీ నాయకత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోందని.. భారత్ పురోగమిస్తున్న విధానం అద్భుతమన్నారు. భారత్‌ను అమెరికన్లు ప్రేమిస్తారని ట్రంప్ వ్యాఖ్యనించారు.
ట్రంప్ తన ప్రసంగంలో అధ్యాత్మిక వేత్త స్వామి వివేకానందను ప్రస్తావించారు. ఏడాదికి భారత్ 2 వేల సినిమాలు నిర్మిస్తోందన్నారు. డీడీఎల్ సినిమాకు సినిమాపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. సంస్కృతి, సంప్రదాయాలకు భారత్ పెద్ద పీట వేసిందని.. భారతీయ సినిమాలను ప్రపంచం ఇష్టపడుతోందన్నారు. విభిన్న భాషల సమ్మేళనం ఇండియా అని అన్నారు. ప్రపంచంలోనే బలమైన సైనిక శక్తి అమెరికాకు ఉందన్నారు. భారత్ భిన్నత్వంలోని ఏకత్వం ప్రపంచానికి ప్రేరణ అని ట్రంప్ వ్యాఖ్యనించారు. ద్వైపాక్షిక బంధం, బలోపేతానికి మోదీ, తాను కృషి చేస్తున్నామని అన్నారు. రెండు దేశాల మధ్య రక్షణ సహకారం కొనసాగుతోందన్నారు. రేపు సైనిక హెలికాప్టర్ల ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం కొనసాగుతందని, ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను అడ్డుకోవడానికి భారత్, అమెరికా పోరాడుతున్నాయని ట్రంప్ అన్నారు.
అంతకుముందు ప్రధాని మోదీ మాట్లాడారు. భారత్-అమెరికా మైతి బంధం వర్ధిల్లాలన్నారు. మోతెరా స్టేడియం నవ చరిత్రకు వేదిక అని మోదీ అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..







