'మోసగాళ్లు'లో సునీల్ శెట్టి డైనమిక్ ఫస్ట్ లుక్ విడుదల
- February 29, 2020
మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న 'మోసగాళ్లు' సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ వేసవిలో చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తోన్న బాలీవుడ్ స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి ఫస్ట్ లుక్ ను శనివారం చిత్ర బృందం విడుదల చేసింది.
ఈ లుక్ లో పోలీస్ యూనిఫామ్, తలకు సిక్కులు ధరించే 'టర్బన్'తో సునీల్ శెట్టి ఒక సిన్సియర్ పోలీసాఫీసర్ గా కనిపిస్తున్నారు. ఆయన పోషిస్తున్న పాత్ర పేరు ఏసీపీ కుమార్.ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణంగా భారత్ లో చోటుచేసుకొని, అమెరికాను సైతం వణికించిన యథార్థ ఉదంతం ఆధారంగా 'మోసగాళ్లు' సినిమా రూపొందుతోంది.
సోమవారం నుంచి ఈ సినిమా తదుపరి షెడ్యూల్ జరగనుంది. కాజల్ అగర్వాల్, రుహాని సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.వియా మార్ ఎంటర్టైన్మెంట్, ఎ.వి.ఎ. ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై విరానికా మంచు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!