ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- September 19, 2025
స్టార్టప్‌లు, స్కేల్‌అప్‌లు తమ కథలను ప్రపంచానికి చెప్పేందుకు ఈ వేదికను వినియోగించుకోండి-మంత్రి శ్రీధర్ బాబు పిలుపు.
హైదరాబాద్‌లో జరుగనున్న ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుండి 100కిపైగా ఐటీ బీట్ జర్నలిస్టులు పాల్గొననున్నారు.
హైదరాబాద్: తెలంగాణ ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల కలిసి ‘పిచ్2ప్రెస్’ పోస్టర్‌ను విడుదల చేశారు.ఈ కార్యక్రమం సెప్టెంబర్ 27, 2025న హైదరాబాదులోని ట్రైడెంట్ హోటల్‌లో జరుగనుంది. ప్రపంచంలోనే తొలిసారిగా జర్నలిస్టుల ముందు నేరుగా ఇన్నోవేటర్లు తమ అనుభవాలను చెప్పుకునే అవకాశం ఇది.
పోస్టర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా, మంత్రి శ్రీ ధర్ బాబు మాట్లాడుతూ, "స్టార్టప్‌లు ఎక్కువగా ఇన్వెస్టర్లకే ఫోకస్ చేస్తుంటారు. కానీ మీ అనుభవాలను ప్రపంచానికి చెబితేనే నిజమైన గుర్తింపు వస్తుంది. పత్రిక లేదా టీవీ కథనాలు మీ వ్యాపారాన్ని ఊహించని స్థాయికి తీసుకెళ్లగలదు. అందుకే స్టార్టప్‌లు, స్కేల్‌అప్స్ తప్పక ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి" అని అన్నారు.
ఇదే సందర్భంలో, మంత్రి తన స్వగ్రామమైన మంథని నియోజకవర్గంలోని ధన్వాడ గ్రామం డిజిటల్ గ్రామంగా మారిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ, డిజిథాన్ సంస్థ చేస్తున్న పనిని ప్రత్యేకంగా ప్రశంసించారు. పిచ్2ప్రెస్ ఈవెంట్‌లో దేశం నలుమూలల నుండి 100 కంటే ఎక్కువ ఐటీ బీట్ జర్నలిస్టులు పాల్గొంటున్నారు. వీరంతా టెక్నాలజీ, స్టార్టప్‌లు మరియు ఇన్నోవేషన్ కవరేజ్‌లో నిపుణులు.ఇది 100 మంది ఇన్నోవేటర్లకు తమ అనుభవాలను మీడియా ముందు నేరుగా ప్రెజెంట్ చేసే అరుదైన అవకాశం.
ఈ సందర్భంగా ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (WTITC) అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ, “పిచ్2ప్రెస్ అనేది ఒక ఈవెంట్ మాత్రమే కాదు, ఇది ఒక ఉద్యమం. ఇన్నోవేషన్‌కు గొంతుక ఇవ్వడం, మంచి అనుభవాల ద్వారా వ్యాపారాన్ని వేగంగా ఎదిగించడమే మా లక్ష్యం. ఒక సారీ జర్నలిస్టులకు మీ అనుభవం నచ్చితే, అది మొత్తం దేశం దృష్టిని ఆకర్షించగలదు. జర్నలిస్టులు, ఇన్నోవేటర్లు ఇద్దరూ తప్పక ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోవాలి" అన్నారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో డిజిథాన్ బృంద సభ్యులు భాగ్యలక్ష్మి వాకిటి, హేమా మారం, దీపిక జోషి, తేజస్విని, నితిన్య హర్కరా మరియు ప్రకాష్ పాల్గొన్నారు.
ఈవెంట్‌లో పాల్గొనాలనుకునే స్టార్టప్‌లు/ఇన్నోవేటర్లు http://tinyurl.com/pitch2press ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు లేదా +91 80190 77575 నంబర్‌ను సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







